Home > Movies - Movie Gossip
పవన్ సినిమాలో చైతూ?

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు రాను రాను బజ్ పెరుగుతోంది. కలర్ ఫుల్ చిత్రీకరణ, రకుల్ గెటప్, నాగ్, సమంత ట్వీట్లు అన్నీ కలిసి సినిమాకు పాజిటివ్ బజ్ తెస్తున్నాయి. ఇదిలా వుంటే, ఈ సినిమా కథపై ఆరంభం నుంచి చాలా గ్యాసిప్ లు వినిపించాయి. ఈ సినిమాకు నిన్నే పెళ్లాడుతా అనే టైటిల్ పెడతారని, ఇది నాగ్ ఎవర్ గ్రీన్ మూవీ నిన్నే పెళ్లాడుతా కథనే అని, కాస్త అటు ఇటు మార్చారని వినిపించింది. ఆ గ్యాసిప్ లు అన్నీ ఎలా వున్నా, రారండోయ్ వేడుక చూద్దాం ట్రయిలర్ చూస్తుంటే మాత్రం కాస్త నిన్నే పెళ్లాడుతూ ఛాయలు కనిపించాయి.

కానీ లేటెస్ట్ గా కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా, హీరో నాగ్ చైతన్య సమీప బంధువు సుప్రియ యార్లగడ్డ ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా ఇక్కడ అమ్మాయి, అక్కడ అబ్బాయి సినిమా కథ ఛాయలు ఈ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో వున్నాయన్నది ఆ గ్యాసిప్ సారాశం.

హీరో, హీరోయిన్ల కుటుంబాలకు పల్లెటూరిలో వైరం వుండడం, ఇది తెలియని ఇద్దరూ ప్రేమలో పడడం, కానీ పెద్దల పంతాలు అడ్డం పడడం, ఇదీ అఅ..ఇఅ సినిమా కథ. మరి రారండోయ్ లో ఏ విధంగా వుంటుందో చూస్తే కానీ తెలియదు.