Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌కళ్యాణ్‌జీ.. ఈసారైనా చేస్తారా?

పవన్‌కళ్యాణ్‌జీ.. ఈసారైనా చేస్తారా?

పవన్‌కళ్యాణ్‌ సొంత నిర్మాణం అనే వార్త ఇప్పటిది కాదు. గత మూడేళ్లుగా పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ గురించి వినిపిస్తూనే ఉంది కానీ ఇంతవరకు ఈ బ్యానర్‌పై సినిమా ఏమీ స్టార్ట్‌ చేయలేదు. గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని ఈ బ్యానర్‌లోనే అనౌన్స్‌ చేసి తర్వాత బండ్ల గణేష్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసేసాడు. ఆ తర్వాత కూడా ఈ బ్యానర్‌లో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో కోబలి వస్తుందని ప్రచారం జరిగింది. 

ఆ సినిమా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. గబ్బర్‌సింగ్‌ 2 చిత్రానికి పవన్‌ కో ప్రొడ్యూసర్‌ అనుకున్నారు కానీ ఈరోస్‌తో పాటు శరత్‌ మరార్‌ దానిని నిర్మిస్తున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ హీరోగా సినిమా చేస్తానంటూ పవన్‌ నుంచి పత్రికా ప్రకటన వచ్చింది. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, ఇతర హీరోలతో సినిమాలు తీస్తానని పవన్‌ చెప్పాడు. 

అయితే పవన్‌ కళ్యాణ్‌ ఏదైనా ప్రకటించిన తర్వాత అది ఎప్పటికి మెటీరియలైజ్‌ అవుతుందనేది అంతు చిక్కదు. చరణ్‌తో సినిమా కూడా ఎప్పటికి స్టార్ట్‌ అవుతుందనేది పవన్‌కే తెలియాలి. అసలు ఈసారైనా పవన్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సీరియస్‌గా ట్రాక్‌ ఎక్కుతుందో లేదో అనేది డౌటే. అన్నట్టు ఈమధ్య తన బ్యానర్‌పై సర్దార్‌ అనే టైటిల్‌ రిజిష్టర్‌ చేసారు. చరణ్‌తో చేసే సినిమాకి అదే టైటిల్‌ అనుకోవచ్చా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?