Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ కు అంత డబ్బులెక్కడివో?

పవన్ కు అంత డబ్బులెక్కడివో?

వరుసపెట్టి సినిమాలు తీయాలనే పవన్ సంకల్పం బయటకు వచ్చింది. ఇదే టాలీవుడ్ జనాలకు కాస్త చిత్రమైన సంగతిలా కనిపిస్తోంది. ఎందకుంటే ఎన్నికలకు ముందు, అది కూడా రేణు దేశాయ్ తో  తెగతెంపులు చేసుకున్నాక, ఆరెంజ్ దెబ్బకు గిలగిల లాడుతున్న నాగేంద్రబాబుకు కాస్త చాతనైన సాయం చేసాక, పవన్ అప్పుల్లోకి వెళ్లినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. 

ఈ నేపథ్యంలో పివిపికి బాకీ పడిన మొత్తానికి వడ్డీ కూడా చెల్లించలేకపోయినట్లు. దాసరి లాంటి పెద్ద మనుషులు కొందరు దాన్ని పివిపి, పవన్ తో తీయబోయే సినిమాకు అడ్వాన్స్ గా మార్చినట్లు వదంతులు వినిపించాయి. ఆ తరువాత జన సేన పార్టీ పెట్టినపుడు కూడా పివిపినే దాని ఖర్చులు భరించారు. అప్పటికి ఇప్పటికి పవన్ ఆదాయ మార్గాలు సినిమాలే. 

అత్తారింటికి దారేది , గోపాల గోపాల రెండు సినిమాలు మాత్రమే పవన్ ఈ మధ్యకాలంలో చేసారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ బారిన పడినపుడు పవన్ తన పారితోషికం కొంత వెనక్కు ఇచ్చారనీ వార్తలువినిపించాయి. నిజమెంతో ఆయనకే తెలియాలి. ఇదిలా వుంటే గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు మధ్యలో డైరక్టర్ ను మార్చకున్నపుడు కొంత మొత్తాన్ని సంపత్ నందికి వదిలేయాల్సి వచ్చింది. అదీ ఖర్చే. 

లాభం ఏదయినా వుందీ అంటే అది గోపాల గోపాల సినిమా తన సన్నిహితుడు శరద్ మురార్ తో కలిసి భాగస్వామ్యం తో చేయడం ఈ విధంగా పవన్ కు పది పన్నెండు కోట్లకు పైగానే వచ్చాయని టాలీవుడ్ వర్గాల అంచానా.. ఇదిలా వుంటే పవన్ విదేశీ వనితను పెళ్లి చేసుకోవడం ఆమెతో భారీ స్టార్ హోటల్లో చిరకాలం కాపురం వుండడం జరిగిందన్నది మరో కబురు. అంటే అక్కడా భారీ ఖర్చే..

మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ భారీ సినిమాలు తీయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అందునా రామ్ చరణ్ సినిమా అంటే పోనీ పారితోషికం ముందు ఇవ్వకపోయినా, కనీసం ఇరవై, ముఫై కోట్లు కావాలి. మళ్లీ ఫైనాన్స్, వడ్డీలు అనే దిశగా పవన్ వెళ్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే అదో చేదు అనుభవం ఆయనకు వుందన్నది టాలీవుడ్ వదంతుల సారాంశం. 

ఇంకో పక్క గబ్బర్ సింగ్2 ప్రాజెక్టు ఒకటి వుండనే వుంది. అంటే శరద్ మురార్ కావచ్చు, పవన్ కావచ్చు కనీసం యాభై అరవై కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వుంది. మరి అంత సొమ్ము పవన్ ఎలా మేనేజ్ చేస్తారో? అయితే పవన్ దగ్గర అంత సొమ్ము వుండివుండాలి. లేదా మళ్లీ పివిపి దన్నుగా నిలవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?