Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ కు ఆయన దూరం.. దూరం

పవన్ కు ఆయన దూరం.. దూరం

ఇండస్ట్రీలో పవన్ గురించి తెలిసిన వారు, ఆయనలో మామూలు జనాలకు తెలియని వ్యక్తి వేరుకొరు వున్నారు అని కామెంట్ చేస్తారు. అది కిట్టని వారి కామెంట్ అని అభిమానులు అంటారు. అలాగే పవన్ పక్కన ఎక్కువ కాలం ఎవ్వరూ వుండలేరని టాక్ కూడా వుంది. పవన్ తన సహాయకులను తరచు మారుస్తూ వుంటారని, అది మార్చడమా? మారిపోవడమా? అన్నది తెలియదని కూడా టాక్ వుంది.

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, చిరకాలంగా పవన్ కు నమ్మిన నేస్తంగా వుంటూ వచ్చిన శరత్ మురార్ ఇప్పుడు దాదాపు దూరమైనట్లే. పవన్ తో రెండు సినిమాలు నిర్మించి, బయ్యర్లతో, డిస్ట్రిబ్యూటర్లతో మాటలు పడి, అలా అని చెప్పి, తాను లాభాలు చేసుకోకుండా పవన్ కు ఒక టూల్ మాదిరిగా ఉపయోగపడ్డారు శరత్ మురార్. 

సర్దార్ గబ్బర్ సింగ్ కు నష్టాలు వచ్చినా, రైట్ ఆఫ్ చేయకుండా పవన్ నిర్మొహమాటంగా శరత్ మురార్ నుంచి వసూలు చేసారని తెలుస్తోంది. ఆ తరువాత సినిమాతో కిందా మీదా పడి నష్టాలు పూడ్చుకున్నారు. మరి ఆ తరువాత పవన్ కు శరత్ మధ్య దూరం పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శరత్ మరార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల గుసగుస. పైగా శరత్ మురార్ తనంతట తాను సినిమా నిర్మాణాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ నటించిన సినిమాను తెలుగులోకి తెస్తున్నారు. మరోపక్క మీడియం రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించే పనిలో భాగంగా స్క్రిప్ట్ లు పరిశీలిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మీడియా వర్క్స్ తో ఇక శరత్ మరార్ జట్టుకట్టనట్లే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?