Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెండేళ్ల వరకు పవన్‌ సినిమా లేనట్టే

రెండేళ్ల వరకు పవన్‌ సినిమా లేనట్టే

పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అవుతోన్న నేపథ్యంలో త్రివిక్రమ్‌తో చేస్తోన్న చిత్రం తర్వాత మరొకటి చేస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. పవన్‌ ఇంతవరకు ఈ విషయంపై తన స్పష్టమైన నిర్ణయం చెప్పకపోవడంతో, అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలకి కూడా సమయం కేటాయిస్తాడని నిర్మాతలు ఆశిస్తున్నారు.

పవన్‌ నెలకి పది రోజుల పాటు డేట్స్‌ ఇచ్చినా కానీ అందుకు అనుగుణంగా సినిమా ప్లాన్‌ చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా వున్నారు. ఎ.ఎం. రత్నం ఏనాడో పవన్‌తో సినిమా కోసం సన్నాహాలు చేసుకున్నాడు. కథాచర్చలు, మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మీదే అతను చాలా ఖర్చు పెట్టేసాడు. అయితే పవన్‌ ఆ సినిమా చేసేదీ లేనిదీ తేల్చలేదు.

ఈలోగా మైత్రి మూవీ మేకర్స్‌ వాళ్లు కళ్లు చెదిరే ఆఫర్‌తో పవన్‌ని అప్రోచ్‌ అయ్యారు. రాజకీయ ప్రచారంతో బిజీగా వున్నా కానీ ఈ సినిమా మాత్రం చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్‌ సినిమా తర్వాత పూర్తిగా రెండేళ్ల పాటు సినిమాలకి పవన్‌ దూరమవుతాడనేది తాజా సమాచారం.

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పర్‌ఫార్మెన్స్‌ని బట్టి ఆ తర్వాత నటించాలా, వద్దా అనేదానిపై పవన్‌ నిర్ణయం తీసుకుంటాడట. పవన్‌కి సంబంధించిన ఏ విషయంపై అయినా ఈమాత్రం సస్పెన్స్‌ మామూలే కనుక దీనిపై అతనే సందేహాలు తీర్చే వరకు వేచి చూడక తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?