Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ను హీరోను చేసిందెవరు?

పవన్ ను హీరోను చేసిందెవరు?

పవన్ కళ్యాణ్ ను పట్టుబట్టి హీరోను ఛేసింది ఎవరు? దీనికి నాగబాబు సమాధానం...వదిన సురేఖ అంట. లేదంటే పవన్ ఈ పాటికి డైరక్టర్ అయి వుండేవాడంట. మరిది పవన్ అందగాడు. మంచి హీరో అవుతాడు అని చెప్పి, భర్తను ఒప్పించి అరవింద్ గారితో సినిమా నిర్మింపచేసారట.

అలా స్టార్ట్ అయింది పవన్ జర్నీ లేకుంటే డైరక్టర్ అయి వుండేవాడు పవన్ అన్నాడు నాగబాబు మొన్నటి బర్త్ డే ఫంక్షన్ లో. చిరంజీవి రాళ్లు రప్పలు తొలగించి, ముళ్ల పొదలు పీకి మెత్తటి దారి చేస్తే, ఇప్పుడ మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ప్రయాణం చేస్తోందని, అందువల్ల మెగాస్టార్ తరువాతే, ఏ పవర్ స్టార్ అయినా మరే స్టార్ అయినా అన్నాడు.

ఒకసారి చిరంజీవి 150వ సినిమా వస్తే, ఈ పవర్ స్టార్ లు, మరే స్టార్ లు దాని ముందు కనపడవన్నారు. పనిలో పనిగా పవన్ మంచి హ్యూమన్ బీయింగ్ అని, అతని వెంట రాజకీయాల్లో వెళ్లాలనుకుంటున్నవారు మాత్రం పదవులు కోరుకునే స్వార్థపరులు అన్నట్లు నాగ బాబు మాట్లాడడంవిశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?