Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ఫిజిక్ మారిపోయిందా?

పవన్ ఫిజిక్ మారిపోయిందా?

ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ గుసగస ఇది. నిన్నటికి నిన్న బయటకు వచ్చిన అజ్ఞాతవాసి స్టిల్స్ చూసిన వారంతా అనుమానపడుతున్న విషయం ఇది. ఈ స్టిల్స్ లో పవన్ కాస్త ఛబ్బీగా, కాస్త వళ్లు చేసినట్లు, కొద్దిగా అంటే కొద్దిగా పొట్ట ముందుకు వచ్చినట్లు వున్నాయి.

పైగా పక్కనే త్రివిక్రమ్ బక్కపల్చగా వున్నారు. దీంతో చిన్న గీత దగ్గర పెద్ద గీత మాదిరిగా పవన్ కాస్త లావుగా కనిపిస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ మధ్య పవన్ లుక్ మారింది. అందంగా కనిపించారు. ఆ తరువాత స్టిల్స్ ఏవీ బయటకు పెద్దగా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఇవేరావడం. ఈ స్టిల్స్ సోషల్ నెట్ వర్క్ పేజీల్లో చలామణీ అవుతున్నాయి.

దీంతో ఇండస్ట్రీ సర్కళ్లలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అజ్ఞాతవాసి పాటలు ఇంకా చిత్రీకరించలేదు. మరి ఇప్పడు ఈ ఫిజిక్ తోనే చిత్రీకరిస్తారా? లేక, కొన్నాళ్లు మళ్లీ జిమ్ చేసి, పవన్ ఫిజిక్ మారాక చిత్రీకరిస్తారా? అన్న అనుమానాలు వక్తం అవుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?