Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ తో చేద్దామనుకున్నారా?

పవన్ తో చేద్దామనుకున్నారా?

కత్తి..మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో దీపావళికి తమిళనాట విడుదలైన సినిమా.  వంద కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా తెలుగు హక్కులు ఠాగూర్ మధు సంపాదించారు. సినిమా ఫైనల్ ప్రింట్ చూసాక ఆయనకు, ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బాగుంటదని అయిడియా వచ్చిందట. మెగా క్యాంప్ కు సన్నిహితుడైన ఠాగూర్ మధుకు పవన్ డేట్లు పెద్ద సమస్య కాపోవచ్చు. కానీ వేరే రూపంలో సమస్య వచ్చిందట. 

విజయ్ ఈ సినిమాను డబ్బింగ్ మాత్రమే చేయాలని, రీమేక్ కు వీల్లేదని హీరో విజయ్ అడ్డంపడ్డాడని వినికిడి. తెలుగునాట తన మార్కెట్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతోందని, తుపాకి తరువాత ఈ సినిమా కూడా విడుదలైతే ఒక మార్కెట్ అంటూ వస్తుందనే స్ట్రాటజీతో రీమేక్ కు అంగీకరించలేదట. దాంతో డబ్బింగ్ తప్పలేదు. రైతుల సమస్యపై తీసిన ఈ సినిమాకు తమిళ నాట ఫరవాలేదనే టాక్, కాస్త మంచి కలెక్షన్లే వచ్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?