Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప‌వ‌న్‌తో దాస‌రి ప్రయోగం

ప‌వ‌న్‌తో దాస‌రి ప్రయోగం

ప‌వ‌న్ క‌ల్యాణ్ - దాస‌రి నారాయ‌ణ రావు కాంబినేష‌న్ టాలీవుడ్ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి షాకింగ్ విష‌యాలు.. ఈ సినిమాలో చాలా చాలా ఉంటాయ‌ట‌. అక్టోబ‌రులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే దాస‌రి మూడు క‌థల్ని ఫైన‌లైజ్ చేశారు. అందులో ప‌వ‌న్ ఏ క‌థ కోరుకొంటే... ఆ క‌థే ప‌ట్టాలెక్కబోతోంది. అయితే ద‌ర్శకుడెవ‌ర‌నే విష‌యంపై అటు దాస‌రి, ఇటు ప‌వ‌న్ ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. 

దాస‌రి ఉద్దేశంలో ఓ కొత్త ద‌ర్శకుడితో.. ప‌వ‌న్ సినిమా చేయించాల‌ని ఉంద‌ట‌. ఇప్పటికే ప్రతిభావంతులైన నూత‌న ద‌ర్శకుల జాబితా ఒక‌టి.. దాస‌రి ద‌గ్గరుంద‌ని, అందులోంచి ఒకొక్కరినీ పిలిపించి మాట్లాడుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ కూడా ద‌ర్శకుడి విష‌యంలో తుది నిర్ణయాన్ని దాస‌రికే వ‌దిలేశాడ‌ట‌. ప‌వ‌న్ ఫామ్‌, క్రేజ్, ఈ సినిమాపై పెరిగే అంచ‌నాలూ  చూస్తుంటే.. కొత్త ద‌ర్శకుడిని ఎంచుకోవ‌డం నిజంగా సాహ‌స‌మే అవుతుంది. 

ప‌క్కా కమ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శకుడిని న‌మ్ముకొని సినిమా మొద‌లెట్టేయ‌డం రిస్క్‌లేని ప‌ని. కానీ దాస‌రి మాత్రం ప్రయోగం చేయ‌డానికే రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. మ‌రి ఆ ద‌ర్శకుడెవ‌ర‌న్నది ఎప్పుడు తేలుస్తారో, ఏంటో?  ఇంతకీ కొత్త దర్శకుడు అయితే తాను చెప్పినట్లు వింటాడని, తాను బ్యాక్ సీట్ డ్రయివింగ్ చేయవచ్చన్నది దాసరి అయిడియానా అన్నది మరో అనుమానం. అలా అయితే మళ్లీ ఎర్రబస్సే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?