Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ వస్తాడని ఎలా అంటున్నారు?

పవన్ వస్తాడని ఎలా అంటున్నారు?

అదిగో మెగా ఫంక్షన్ అంటే, ఇదిగో పవన్ అంటారు. అలాగే తయారైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ లేటెస్ట్ మూవీ తొలి ప్రేమ ఆడియో ఫంక్షన్ ఈ రోజు జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు పవన్ వస్తున్నాడా? అంటూ వార్తలు వండి వార్చేస్తున్నారు. ఈ వార్తలు చదివి అస్సలు మినిమమ్ ఆలోచన వుందా ఈ వార్తల వెనుక అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

అజ్ఞాతవాసి లాంటి భయంకరమైన పరాజయాన్ని చవిచూసి, ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా వుండిపోయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పబ్లిక్ ఫంక్షన్ కు వస్తారని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

మామూలుగానే అన్నీ బాగుండి, ఎక్కడా ఏ చిన్న తేడా వుండదు అనుకుంటే తప్ప, పవన్ బయటకు రారు. అలాంటిది ఇంతటి పరాజయం తరువాత అంత సులువుగా బయటకు వస్తారా? అందునా సినిమా ఫంక్షన్ కు?

కేవలం వస్తాడా? అని ఓ వార్త, రాలేదు అని మరో వార్త రాసుకోవడానికి తప్ప మరేం కాదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?