Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెద్ద బ్రాండ్‌లను వదిలి ఇప్పుడు చిన్నవి చేస్తుంది

పెద్ద బ్రాండ్‌లను వదిలి ఇప్పుడు చిన్నవి చేస్తుంది

హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటే చాలు.. వెంటనే సైడ్‌ బిజినెస్‌ కూడా కలిసి వచ్చేస్తుంది. సైడ్‌ బిజినెస్‌ అంటే అపార్ధం చేసుకోకండి. షూటింగ్‌లేని రోజుని కూడా క్యాష్‌ చేసుకోవడానికి బట్టల షాపుకు వెళితే లక్షలు, డ్రా తీస్తే డబ్బులు. ఇక బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేస్తే సంవత్సరానికి ఇన్ని కోట్లు అని ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. ఎప్పుడూ సినిమాలతో బిజీగా వుండే అనుష్క ఇప్పుడు కాస్త ఖాళీ చేసుకుని ‘ఇంటెక్స్‌’ సెల్‌ఫోన్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండటానికి ఒప్పుకుంది. ఇంటెక్స్‌ చిన్న కంపెనీ ఏం కాదు. గతంలో అనుష్క కోసం శామ్‌సంగ్‌, ఎల్‌జి లాంటి కంపెనీలు క్యూ కట్టాయి. అప్పుడు అనుష్క ఏ కారణాల చేతనో ఆసక్తి చూపలేదు. ఆఖరికి బిగ్‌-సి ఆఫర్‌ని కూడా అనుష్క అప్పట్లో వదిలేశాకే ఛార్మి తదితర హీరోయిన్లకు దక్కింది.

పెద్ద పెద్ద కంపెనీలు అప్పట్లో అడిగితే కాదన్న అనుష్క, ఇప్పుడు సెల్‌ఫోన్లకు ఎందుకు ప్రమోషన్‌ చేస్తానని ఒప్పుకుంది.? అనే సందేహాలతో రంధ్రాన్వేషకులు పసంరిఖీశోధనలు మొదలు పెట్టారు. బహుశా సినిమాలు తగ్గిపోతుండవచ్చు.. లేదా భారీ ఆఫర్‌ కొట్టేసి వుండవచ్చు.. లేదూ భారీ ప్రకటనల్లో నగర కూడళ్ళలో ప్రతిరోజూ భారీ హోర్డింగ్స్‌తో ప్రజలకు టచ్‌లో వుండొచ్చు.. ఇలాంటి కారణాలతోనే అనుష్క ఒప్పుకుని వుంటుందని భావిస్తున్నారు. అనుష్క పుణ్యమా అని ఇంటెక్స్‌ ఫోన్లు భారీ స్థాయిలో అమ్ముడయితే అదే ‘పది కోట్లు’ మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?