Home > Movies - Movie Gossip
ఫొటోషూట్లు ఎక్కువ... సినిమాలు తక్కువ

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో ఒక్కసారిగా మెరిసింది నందిత శ్వేత. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ సినిమా రిలీజై ఇన్ని నెలలైనప్పటికీ ఇప్పటివరకు మరో తెలుగు సినిమా ఛాన్స్ దక్కించుకోలేకపోయింది నందిత. టాలీవుడ్ కనెక్ట్ కోసం ఎప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు రిలీజ్ చేస్తూనే ఉంది. అలా ఈ 4 నెలల కాలంలో అరడజను ఫోటొషూట్లు అయితే వచ్చాయి కానీ, నందితకు సినిమా ఛాన్స్ మాత్రం ఒక్కటి కూడా దక్కలేదు. 

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లలో హెబ్బా పటేల్, అవికా గౌర్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ వాళ్లిద్దరి కంటే అదే సినిమాతో పరిచయమైన నందిత శ్వేత బాగా ఆకట్టుకుంది. రివ్యూల్లో కూడా ఈమెకే ఎక్కువ మార్కులు దక్కాయి. కానీ సరైన ప్లానింగ్ లేక టాలీవుడ్ కు దూరమైపోయింది నందిత.

నిజానికి ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తర్వాత ఆమెకు ఏకంగా 3 సినిమా ఛాన్సులు వచ్చాయి. కానీ అదే టైమ్ లో ఆమె బ్యాక్ టు బ్యాక్ తమిళ సినిమాలు అంగీకరించింది. ప్రస్తుతం నందిత చేతిలో 5 కోలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. అందుకే కనీసం ఒక్క తెలుగు సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించలేకపోయింది. క్రేజ్ ఉన్నా క్యాష్ చేసుకోలేకపోవడం అంటే ఇదే.