Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పోలీస్ ఆఫీసర్ గా అన్నపూర్ణ సుప్రియ

పోలీస్ ఆఫీసర్ గా అన్నపూర్ణ సుప్రియ

ఎప్పుడో పవన్ కళ్యాణ్ తొ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది అక్కినేని వారి మనవరాలు యార్లగడ్డ సుప్రియ. ఆ తరువాత మరి సినిమాలు చేయలేదు. స్టూడియో మేనేజ్ మెంట్ లో బిజీ అయిపోయింది. ఆ తరువాత మళ్లీ సినిమాల జోలికిపోలేదు. ఇన్నాళ్ల తరువాత మొహానికి మేకప్ వేసుకుంటోంది.

క్షణం సినిమాలో యాంకర్ అనసూయను పోలీస్ ఆఫీసర్ ను చేసిన హీరో అడవి శేష్ ఇప్పుడు తను తాజాగా చేస్తున్న గూఢచారి సినిమాలో సుప్రియను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారు. నిజానికి సుప్రియకు సినిమాల్లోకి మళ్లీ రావడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. అయితే అడవి శేష్ మంచి స్నేహితుడు కావడంతో, కోరి ఒప్పించినట్లు వినికిడి.

క్యారెక్టర్ కీలకమైనది కావడం, రెగ్యులర్ ఫేస్ కాకుండా, విభిన్నంగా వుండాలనే ఆలోచనతో సుప్రియను ఒప్పించినట్లు తెలుస్తోంది. గూడచారి సినిమా మార్చిలో విడుదలకు సిద్దం అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?