Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవర్‌స్టార్‌.. మోడీ స్టయిల్‌!

పవర్‌స్టార్‌.. మోడీ స్టయిల్‌!

పవన్‌కళ్యాణ్‌ ‘గోపాల గోపాల’ గెటప్‌ లీకయింది. ఈ చిత్రంలో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్ర చేస్తోన్న పవన్‌ ఆహార్యం ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చింది. ఇందులో పవన్‌ వస్త్రధారణ మన ప్రధాని నరేంద్ర మోడీ ట్రేడ్‌మార్క్‌ డ్రస్సింగ్‌ స్టయిల్‌కి దగ్గరగా ఉంది. ఈ క్యారెక్టర్‌కి ఈ తరహా కాస్టూమ్స్‌ బాగుంటాయనేది ఎవరి ఐడియానో కానీ మోడీ అభిమాని అయిన పవన్‌ తన ఫేవరెట్‌ పొలిటీషియన్‌ స్టయిల్‌లో కనిపించబోతున్నాడు. 

వెన్ను నొప్పి కారణంగా కొంత కాలం షూటింగులకి దూరమైన పవన్‌ కళ్యాణ్‌ చిన్నపాటి శస్త్ర చికిత్స అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘గోపాల గోపాల’ చిత్రానికి ఇరవై ఎనిమిది రోజుల కాల్షీట్స్‌ కేటాయించిన పవన్‌పై ప్రస్తుతం ఒక పాట చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. 

ఓ మై గాడ్‌ అనే హిందీ చిత్రానికి రీమేక్‌ అయిన ‘గోపాల గోపాల’లో తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా కొన్ని మార్పుచేర్పులు చేసినట్టు తెలిసింది. దీనిని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?