Advertisement


Home > Movies - Movie Gossip
"సాహో" సినిమాలో "బాహుబలి" ఫైట్స్

దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది ప్రభాస్ నెక్ట్స్ సినిమా. ప్రభాస్ ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడట. సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇలాంటి సినిమా చేయాలంటే హీరో ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎక్స్ ట్రా ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ప్రభాస్ మాత్రం ఇవన్నీ చాలా లైట్ అంటున్నాడు. సింగిల్ టేక్ లో అన్నీ ఓకే చేస్తానంటున్నాడు. 

సుజీత్ సినిమా గురించి ప్రభాస్ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడ్డానికి కారణం బాహుబలి సినిమా. ఈ సినిమా కోసం చాలా రకాల ట్రయినింగ్స్ తీసుకున్నాడు ప్రభాస్. కొండలు ఎక్కడం, గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్ లాంటి అంశాల్లో శిక్షణ పొందాడు. ఇవన్నీ తనకు సాహో సినిమా కోసం పనికొస్తాయంటున్నాడు ప్రభాస్. అందుకే సాహోలో ఫైట్స్ పై పెద్దగా టెన్షన్ పడడం లేదని చెప్పాడు.  

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీతో పాటు కుదిరితే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తానంటున్నాడు ప్రభాస్. 2018 నుంచి ఏడాదికి కనీసం 2 సినిమాలు రిలీజ్ చేయాలనేది ప్రభాస్ ప్లాన్.