Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా?

ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా?

బాహుబలి లెక్కలు అన్నీ ఆ సినిమాలో రానా విగ్రహం మాదిరిగా చాలా భారీగా వుంటాయి. నిర్మాణం ఖర్చు అలాగే వుంది. కలెక్షన్లు అలాగే వున్నాయి. లాభాలు ఆ రేంజ్ లోనే వున్నాయి. మరి అలాంటపుడు అయిదేళ్ల పాటు ఓ సినిమాకు అంకితమై వుండిపోయినందుకు హీరో ప్రభాస్ కు ఈ సినిమా ద్వారా ఎంత వచ్చి వుంటుంది.ఇది కాస్త ఆసక్తి కరమే.

వాస్తవానికి ప్రభాస్ కు వచ్చిన డబ్బుల కన్నా పేరే ఎక్కువ. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాకు హీరో ప్రభాస్ నే. అలాగే అనేకానేక చెరగని, ఇప్పట్లో చెరపలేని రికార్డులు ప్రభాస్ సొంతమే. కానీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, రూపొందించిన దర్శకుడితో పోలిస్తే, ప్రభాస్ ఈ సినిమాకు వచ్చింది జస్ట్ పల్లీ బటానీ మాత్రమే అనుకోవాలి.

ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరో  సినిమాకు కనీసం పది హేను కోట్లు తీసుకున్నా, (పవన్, మహేష్ ఇరవై కోట్లు తీసుకుంటున్నారు) అయిదేళ్లలో పది సినిమాలు చేసే అవకాశం వుంటుంది అనుకుంటే, 150 కోట్ల ఆదాయం. కానీ ఈలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం, అన్నీ వదులుకున్నాడు ప్రభాస్. అది గ్రేట్. అయితే ఇందుకు గాను అతనికి ముట్టిన పారితోషికం జస్ట్ పాతిక కోట్లే. తొలి భాగానికి 7 కోట్లు, మలి భాగానికి 18 కోట్లు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్, పేరు, ఇలాంటివి అన్నీ లెక్క వేసుకుంటే, అది అపరిమితం అవుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?