Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ పారితోషికం సున్నా

ప్రభాస్ పారితోషికం సున్నా

సాహో సినిమాకు ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఎంత కావాలో చెప్పమని నిర్మాతలు అడిగినా వద్దనేశాడు. అవును.. అంతకుమించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో సినిమా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడట.

బాహుబలి-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ కచ్చితంగా తన పారితోషికం పెంచుతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం పారితోషికం పెంచలేదు. నిర్మాతలు తన బంధువులు, స్నేహితులే కావడంతో, వాళ్లను ఎక్కువ డిమాండ్ చేయడం ఇష్టంలేక ఊరుకున్నాడట. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలే ప్రభాస్ కు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. బయట హీరోలకు ఇచ్చినట్టు పారితోషికం కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పడం, దానికి ప్రభాస్ ఓకే అనేయడం జరిగిపోయాయట.

దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వస్తోంది సాహో సినిమా. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ బాహుబలి-2 క్రేజ్ ఉంది కాబట్టి, ఈసారి బాలీవుడ్ లో కూడా సాహో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సో.. ప్రభాస్ కు సాహో సినిమాతో కాస్త పెద్ద ఎమౌంటే దక్కబోతోంది.

జులై మొదటి వారం నుంచి సాహో మూవీ సెట్స్ పైకి వస్తుంది. సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు. ముంబయితో పాటు దుబాయ్, యూరోప్ దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?