Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రకాష్ తో నాగ్ సినిమా

ప్రకాష్ తో నాగ్ సినిమా

రాఘవేంద్ర రావు కు నాగార్జునకు వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. అలాగే మంచి సబ్జెక్ట్ లు వస్తే, చిన్న సినిమాలు నిర్మించడం అన్నది నాగ్ కు వున్న మంచి అలవాటు. తాను హీరోగా వుంటూనే, జగపతి బాబు మాంచి ఊపుమీద వున్నపుడే అతగాడితో సినిమా నిర్మించాడు. అలాగే ఉయ్యాలజంపాల లాంటి చిన్న సినిమాల్లో పాలు పంచుకున్నాడు. 

ఇప్పుడు ఈ రెండింటికి మ్యాచ్ అయ్యే విషయం ఏమిటంటే..రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ తాజగా తీసిన సైజ్ జీరో సినిమా చూసి నాగ్ ఇంప్రెస్ అయ్యాడట. ముఖ్యంగా ఫ్యామిలీ వాల్యూస్, అనుబంధాలు వంటివి బాగా, పిక్చరైజ్ చేసాడని. ఆ తరహాలో మరో మంచి కథ రెడీ చేస్తే,  తాను ప్రొడ్యూస్ చేస్తానని మాట ఇచ్చేసాడని వినికిడి. 

గొల్లపూడి-ఊర్వశి-అనుష్క నడుమ వచ్చిన సీన్లు బాగున్నాయని, అలాంటి వాటితో సరైన కథ తయారుచేయమని సూచించాడట. సో..ప్రకాష్ కు మరో ఆఫర్ వచ్చినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?