Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పృధ్వీకి కూడా వెగకేసిందా?

పృధ్వీకి కూడా వెగకేసిందా?

తినగా తినగా గారెలు కూడా చేదెక్కుతాయన్నది సామెత. సిన్మాల్లో స్పూఫ్ ల వ్యవహారం కూడా అలాంటిదే. ఓసారి సరదా, రెండు సార్లు సరదా ఎక్కువైతే మొహం మొత్తుతుంది. సుడిగాడు తరువాత అల్లరి నరేష్ వ్యవహారం ఇలాగే తయారయింది. ఇప్పుడు పృధ్వీ వ్యవహారం కూడా ఇలాగే తయారయ్యేలా వుంది.

బాలయ్య సీన్లను స్పూఫ్ లు చేస్తుంటే జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతానికి. కానీ రాను రాను ఇది కూడా బోర్ కొట్టేలా వుందని టాక్ వినిపిస్తోంది. మొన్నటికి మొన్న చెప్పనుబ్రదర్ అంటూ ట్రయిలర్ లో పృధ్వీ అంటే భలే రియాక్షన్ వచ్చింది. కారణం కొత్తగా వుండడమే. కానీ బాలయ్య డైలాగ్ ల అనుకరణం విషయంలో మాత్రం ఇప్పటికే కాస్త మొహం మొత్తేసే రేంజ్ కు వచ్చేసిందని పృధ్వీ కూడా గమనించినట్లున్నాడు. 

దాన్ని వేరే విధంగా కవర్ చేస్తున్నాడు. బాలయ్య అభిమానులు ఫీలవుతున్నారు, నాకు కూడా బాలయ్య అంటే గౌరవం. అందుకే ఇక ఆయనను అనుకరించను అంటున్నాడు. ఇంతకీ గౌరవంతోనా, లేదా పృధ్వీకి కాస్త వెగటు అనిపిస్తున్నాయా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?