Advertisement


Home > Movies - Movie Gossip
అజ్ఞాతవాసి: అసలైన ప్రచారం ఇది

పవన్ 25వ సినిమా ప్రచారానికి సంబంధించి ఈమధ్య కాలంలో ఏదేదో చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ అన్నారు.. మ్యూజికల్ సర్ ప్రైజ్ అన్నారు.. చివరికి సింగిల్ కూడా విడుదల చేశారు. కానీ ఆయా సందర్భాల్లో ఎంత క్రేజ్ వచ్చిందో.. దానికి పదింతల బజ్ తాజాగా విడుదల చేసిన స్టిల్స్ ద్వారా వచ్చింది.

యూరోప్ షెడ్యూల్ లో భాగంగా పవన్ పై క్లిక్ మనిపించిన ఫొటోల్ని అఫీషియల్ గా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎక్కడ చూసినా ఈ ఫొటోలే.

పవన్ సినిమాకు సంబంధించి కావాల్సింది కాన్సెప్ట్ పోస్టర్లు, మ్యూజికల్ సర్ ప్రైజులు కావు. ఇలా స్టయిలిష్ గా కనిపించే  ఫొటోలు విడుదల చేస్తే చాలు.. అభిమానులు పండగ చేసుకుంటారు. తాజా ఇన్సిడెంట్ తో మేకర్స్ కు ఈ విషయం తెలిసొచ్చింది. అన్నట్టు ఈ మధ్య కాలంలో పవన్ కాస్త లావెక్కాడు, వయసు పెరిగిన ఛాయలు కనిపిస్తున్నాయనే విమర్శలకు కూడా ఈ ఫొటోలు తిరుగులేని సమాధానంగా నిలిచాయి. పవన్ లో ఇప్పటికీ అదే మెరుపు, అదే స్టయిల్.

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ప్రస్తుతం యూరోప్ లో జరుగుతన్న షెడ్యూల్ ఆఖరిదని భావిస్తున్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 14న ఆడియో రిలీజ్ చేసి, జనవరి 10న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.