Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి క్యారెక్టర్ మాత్రం చెప్పాడట

పూరి క్యారెక్టర్ మాత్రం చెప్పాడట

అరచేతిలో బొమ్మ చూపించేయడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ ది అందెవేసిన చేయి. ఇప్పుడు హీరో వెంకటేష్ కు కూడా అదే చేసాడట. రోగ్ సినిమా ట్రయిలర్లు, కొన్ని సీన్లు తీసుకెళ్లి చూపించాడట. అలాగే ఓ మాంచి క్యారెక్టరైజేషన్ చెప్పాడట. దాంతో సరే, అని విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

 కానీ సింపుల్ ఒక్క కండిషన్ మాత్రం పెట్టాడట. మొత్తం కథ చెప్పాలి, అదే ఆ కండిషన్. అంతే అప్పటి నుంచి మళ్లీ ఇంకా ఇప్పటివరకు పూరి కథ రెడీ చేయలేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. పూరి చెప్పిన హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుందని, దాని చుట్టూ సరైన కథ వుంటే కచ్చితంగా చేస్తానని వెంకీ అంటున్నట్లు తెలుస్తోంది.

పూరి కనుక త్వరగా కథ రెడీ చేస్తే దాన్ని ముందు చేసి, ఆ పై క్రిష్ సినిమాను 75వసినిమా చేయాలని అనుకుంటున్నాడట వెంకీ. లేదూ, కథ చెప్పకుండా, కేవలం ఇలా ట్రయిలర్లు, క్యారెక్టరైజేషన్లు చెబితే మాత్రం ఇప్పట్లో పూరి సినిమా పట్టాలు ఎక్కదట. పూరితో గతానుభావాలు, రీసెంట్ ఫ్లాప్ లు కలిసి, కథ విషయంలో మాత్రం గట్టిగా పట్టుపట్టి వుండాలని వెంకీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?