Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి ఇంట్లో ఎన్టీఆర్ సినిమా క్లాప్

పూరి ఇంట్లో ఎన్టీఆర్ సినిమా క్లాప్

పూరి జగన్నాధ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా క్లాప్, పూజా కార్యక్రమానికి వెన్యూ ఫిక్సయింది. పూరి జగన్నాధ్ అత్యంత వైభవంగా నిర్మించుకున్న కొత్త ఆఫీస్ కమ్ రెసిడెన్స్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు వచ్చేనెల జరుగుతాయి.కేవ్ పేరిట పూరి తన అభిరుచి మేరకు 20 కోట్లకు పైగా ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 

గతంలో మహేష్-పూరి కాంబినేషన్ లోని పోకిరి సినిమాను జగన్నాధ్ (పాత) ఆఫీసులోనే ప్రారంభించారు. అది సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ (కొత్త)ఆఫీసులో ఈ సినిమాకు క్లాప్, పూజ చేస్తారు. అదీ సెంటిమెంట్. పూరి ఆపీసుకు ఎన్టీఆర్ కాస్ట్లీ స్పీకర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడే సినిమా ఓపెనింగ్ అంటే, వారి బంధం ఏ రేంజ్ లో బలపడిందో అర్థం అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?