Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి అయిటమ్ స్పెషాలిటీ

పూరి అయిటమ్ స్పెషాలిటీ

అయిటమ్ సాంగ్ లేని కమర్షియల్ సినిమా కూర లేని పూరి లాంటిదే. అందునా పూరిజగన్నాధ్ సినిమాల్లో అయిటమ్ సాంగ్ అంటే అదో స్పెషల్. లేటెస్ట్ గా బాలకృష్ణతో పూరిజగన్నాధ్ తీస్తున్న సినిమాలో కూడా అయిటమ్ సాంగ్ వుంది. పైగా సినిమాలో అన్నింటి కన్నా ఫస్ట్ వచ్చేదే అయిటమ్ సాంగ్ అంట. సినిమా ఓపెనింగ్ లోనే పబ్ బ్యాక్ డ్రాప్ లో అయిటమ్ సాంగ్ వుంటుంది. దీని కోసం ఇక్కడ ప్రత్యేకంగా సెట్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల్లో అయిటమ్ సాంగ్ అంటే మధ్యలో వస్తుంది. కానీ పూరి సినిమా కదా? స్టార్టింగ్ నే అయిటమ్ సాంగ్ అంట.

ఇప్పటికే విదేశాల్లో రెండు పాటలు శ్రియ కాంబినేషన్ లో, ఒక పాట మస్కన్ కాంబినేషన్ లో బాలయ్యతో షూట్ చేసేసారు. ఈ అయిటమ్ ను స్పెషల్ సెట్ లో చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ అయిటమ్ పాప ఎవరు అన్నదే ఇంకా డిసైడ్ కాలేదట. పూరి ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదని వినికిడి. కొత్త అమ్మాయిని ఎవరైనా తీసుకువస్తారా? లేక చాయ్.. సక్కుబాయ్ గా అయిటమ్ చేసిన చార్మి వుండనే వుందని ఓకె చేయిస్తారా? చూడాలి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?