Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పివిపి మాల్ హడావుడి ఇంతా అంతాకాదు

పివిపి మాల్ హడావుడి ఇంతా అంతాకాదు

సినిమా వాళ్లు ఏం చేసినా కాస్త ఎక్కువగానే వుంటుంది. పివిపి సంస్థ కార్పొరేట్ వ్యవహారాలకు కీలకమైనా ఇప్పుడు సినిమాల నిర్మాణంలోకి కూడా వచ్చింది. అందుకే కావచ్చు, ఆ సంస్థ విజయవాడలో తాజాగా నిర్మించిన పివిపి మాల్ ఓపెనింగ్ కు తెగప్రచారం సాగిస్తోంది. 

విజయవాడ ఎంజీ రోడ్ లో నిర్మించిన ఈ మాల్ ప్రారంభోత్సవానికి మాస్టర్ బ్యాట్స్ మన్, రాజ్య సభ సభ్యుడు సచిన విచ్చేస్తున్నాడు. అతని పక్కన అందాల సీనియర్ హీరోయిన్ అనుష్క కూడా తళుక్కున మెరవబోతోంది. 

చిత్రంగా పివిపి కి అత్యంత సన్నిహితుడుగా, ప్రజారాజ్యం పార్టీ నేత, హీరో పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు.అయితే పవన్ సంగతి తెలిసిన వారు మాత్రం, పబ్లిక్ ఫంక్షన్లు అంటే పవన్ కు అంత ఇష్టం వుండదు కాబట్టి, ముందే నో చెప్పి వుంటాడు అని సర్ది చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఎంజీ రోడ్లో ఓ మాల్ వుంది,.బెంజ్ సర్కిల్ దగ్గర లింగమనేని మాల్ వుంది. ఇప్పుడు దీంతో విజయవాడకు మరింత ఆకర్షణ పెరుగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?