Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రభస లాభం అల్లుడి పాలు

రభస లాభం అల్లుడి పాలు

రభస రిజల్ట్ సంగతి ఎలా వున్నా నిర్మాత బెల్లంకొండ 16 కోట్ల లాభం చేసుకున్నట్లు తెలుస్తోంది. 40 ఖర్చు చేసి 16 లాభం వేసుకుని 56 సంపాదించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఎన్టీఆర్ ను డైరక్ట్ చేసిన దర్శకులు ఎవరికీ రానంత అతి తక్కువ మొత్తం ఈ సినిమా దర్శకుడికి వచ్చింది. కేవలం 75 లక్షలు. 

బెల్లంకొండ వినాయక్ కు 12 కోట్లు, ఇప్పుడు బోయపాటికి 9 కోట్ల ఇస్తున్నట్లు బోగట్టా. అలాంటిది సంతోష్ శ్రీనివాస్ కు 75లక్షలతో సరిపెట్టారు. అది అలా వుంచితే అల్లుడి శ్రీను సినిమాలో పది వరకు పోయిందని అది రభసతో సరిపోయిందని అంటున్నారు. అందుకే వెంటనే మళ్లీ మరో భారీ సినిమా కు శ్రీకారం చుట్టేసాడంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?