Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాధ ఇప్పట్లో రాదా?

రాధ ఇప్పట్లో రాదా?

శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడితో బోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా రాధ. నిజానికి జనవరికే రావాలి. కానీ  ఉగాదికే వస్తుందన్నారు. అయితే కాటమరాయుడు కోసం వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని టాక్. ఏప్రియల్ ఫస్ట్ వీక్ అన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఇది ఏప్రియల్ కాదు, మేలో ఏదో ఓ డేట్ కు వచ్చే అవకాశం వుందని.

ఓ పాట లేకుండా సినిమా అంతా రెడీ చేసారు. ఈలోగా కాటమరాయుడు సినిమా రావడంతో, ఎలాగూ వాయిదా వుందని పక్కన పెట్టారు. దాంతో హీరో శర్వానంద్ కొత్త సినిమా మీదకు వెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ పాట పై దృష్టి పెట్టారట. దాంతో శర్వానంద్ మళ్లీ ఇటు వచ్చి ఆ పాట ఫినిష్ చేయాలి. అప్పుడు సినిమా రెడీ కావాలి.

ఇవన్నీ ఏప్రియల్ ఫస్ట్ వీక్ లోగా జరిగే వ్యవహారాలు కావు. అందువల్ల మే నెలలో డిజె, ఇతరత్రా సినిమాల సంగతులు చూసి అప్పుడు డిసైడ్ చేసుకుంటారట డేట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?