Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాధిక కు టాలీవుడ్ నచ్చలేదట

రాధిక కు టాలీవుడ్ నచ్చలేదట

రాధిక ఆప్టే..బాలయ్య సరసన సినిమా చేసిన ముద్దుగుమ్మ. మళ్లీ మరో సినిమా చేస్తోంది కూడా. అంటే టాలీవుడ్ వ్యవహారాలు బాగా తెలిసే వుండాలి. అయినా కూడా ఇక్కడ ఏమీ తెలియనట్లు, అంతా బాగున్నట్లు మాట్లాడాలి అని మాత్రం తెలియనట్లుంది. అందుకే అక్కడా ఇక్కడ చకచకా తన చిత్తానికి వచ్చినట్లు మాట్లాడేస్తోంది. 

టాలీవుడ్ లో తలకాయనొప్పులు ఎక్కువని, హీరోల డామినేషన్, వారసత్వాలు ఇత్యాది వ్యవహారాలు చాలా వున్నాయని కామెంట్ చేసిందని ఇప్పుడు బయటకువచ్చింది. లెజెండ్ లాంటి హిట్ ఇచ్చినా మళ్లీ సరైన సినిమా పడలేదు. మరోసారి బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కనే చేయాల్సి వచ్చింది. కుర్ర హీరోల కన్ను తనపై పడలేదు. అందుకనేమో..ఇలా కామెంట్ చేసినట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?