Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ కు దర్శకుడు 'దోరికాడు'

రాజ్ తరుణ్ కు దర్శకుడు 'దోరికాడు'

ఉయ్యాల జంపాల సినిమాతో తళుక్కున మెరిసాడు రాజ్ తరుణ్. అయితే ఆ తరువాత ఇంతవరకు మరో సినిమా లేదు. హిట్ సినిమా కొట్టిన హీరోకి మళ్లీ సినిమా వెంటనే లేకపోవడం చాలా ఆశ్చర్యమే.  అయితే అందరూ అనుకున్నదేమిటంటే రాజ్ తరుణ్ ఆచి తూచి అడుగు వేస్తున్నాడని. 

ఇప్పుడు తాజగా సినిమా చూపిస్తా మావా..నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ గ్యాప్ కు కారణంపై కృష్ణానగర్ లో భలే డిస్కషన్లు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ హీరో కాక ముందు సహాయ దర్శకుడు. 

ఇప్పుడు ఎవరు హీరోగా సినిమా చేయమని అడిగినా, స్క్రిప్ట్ మొత్తం తన చేతికి ఇస్తే, సరి చూసి, సరి చేసి ఇస్తానని, ఆ షరతుకు ఓకె అంటేనే సినిమా చేస్తానని అంటున్నాడన్నది ఆ డిస్కషన్ సారాంశం. నిజమో కాదో కానీ, అంత హిట్ ఇచ్చాక, ఇలా ఓ మళ్లీ ఓ చిన్న సినిమా అంగీకరించాడంటే, ఏదో విషయం వున్నట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?