Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళీ, ఈ ప్రశ్నలకు బదులెక్కడ.?

రాజమౌళీ, ఈ ప్రశ్నలకు బదులెక్కడ.?

దర్శక ధీరుడు రాజమౌళి, 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాతో మరోమారు ప్రశంసలు అందుకుంటున్నాడు.. అదీ దేశవ్యాప్తంగా. ఓ తెలుగు సినిమాకి జాతీయ మీడియా ఈ స్థాయిలో పబ్లిసిటీ ఇవ్వడం అనేది ఇంతకుముందెన్నడూ జరగలేదు. బాలీవుడ్‌లో సైతం 'బాహుబలి'పై బీభత్సమైన అంచనాలుండడమే అందుకు కారణం. తొలి రోజు వసూళ్ళెంత.? అన్నదానిపై కాస్సేపట్లో క్లారిటీ వస్తుంది. ఆ రికార్డ్‌ ఎలాగూ 'బాహుబలి'కే దక్కుతుందనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, సినిమా విడుదలయ్యాక మళ్ళీ బోల్డన్ని ప్రశ్నలు రాజమౌళి ముందుకొచ్చాయి.. వాటికి సమాధానం చెప్పాల్సింది ఆయనే. 'బాహుబలి' సినిమాలో భళ్ళాలదేవుడికి కొడుకు వున్నాడు.. ఆ కొడుకుని, స్వయంగా శివుడు చంపేస్తాడు. మరి, భళ్ళాదేవుడి భార్య ఎవరు.? అస్లాం ఖాన్‌ పాత్రలో సుదీప్‌ కనిపించాడు.. అదీ మొదటి భాగంలో. రెండో భాగంలో సుదీప్‌ జాడ లేదు. తమన్నాకి చివర్లో కాస్సేపు మాత్రమే స్పేస్‌ ఇచ్చాడు బాహుబలి. అదీ అసంపూర్తిగానే అన్పించింది అభిమానులకి. 

ముచ్చటగా ఈ మూడు ప్రశ్నలూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అనే రేంజ్‌లో, భళ్ళాల దేవుడి భార్య ఎవరు.? అనే ప్రశ్న హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీంతోపాటుగా, మిగతా ప్రశ్నలకీ రాజమౌళి సమాధానం చెప్పాల్సి వుంది. 

అయితే, భళ్ళాలదేవుడి భార్య ఎవరన్నది అప్రస్తుతం. అస్లాంఖాన్‌ మళ్ళీ కన్పించాలనే రూల్‌ ఏమీ లేదు. ఇక, తమన్నాకి ఇవ్వాల్సిన స్కోప్‌ మొదటి పార్ట్‌లోనే ఇచ్చేశారు గనుక, అదీ పెద్ద విషయం కాదనే వాదనలూ విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, సినిమా నిడివి నేపథ్యంలో కొన్ని సీన్స్‌ తీసేయడంతోనే ఆ ప్రశ్నలు అలా వుండిపోయాయనీ, ముందు ముందు వాటికి సంబంధించిన సన్నివేశాలు అదనంగా కలపొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే 'బాహుబలి ది కంక్లూజన్‌' సక్సెస్‌ని టీమ్‌ ఎంజాయ్‌ చేస్తోంది గనుక, కాస్త తీరిగ్గా ఈ వ్యవహారంపై రాజమౌళి దృష్టిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?