Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి బాటలో క్రిష్

రాజమౌళి బాటలో క్రిష్

మిగిలిన డైరక్టర్లకు రాజమౌళికి ఓ తేడా వుంది. కేవలం దొరికిన హీరోతో సినిమా చేసామా, సక్సెస్ అందుకున్నామా అన్న టైపు వ్యవహారం కాదు రాజమౌళిది. సినిమా సినిమాకు మరో మెట్టు ఎక్కుతున్నామా లేదా? సక్సెస్, డబ్బు కన్నా, పేరు ఎంత వచ్చింది అన్నది కూడా చూసుకుంటాడాయన. డైరక్టర్ క్రిష్ కూడా ఇప్పుడు అదే బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. చేసిన జోనర్ చేయకుండా, వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ గమ్యం నుంచి శాతకర్ణి వరకు చేసుకుంటూ వస్తున్నారు. 

అన్నీ ఒక ఎత్తు, శాతకర్ణి ఒక ఎత్తు. ఈ సినిమాతో క్రిష్ చాలా మెట్లు ఎక్కారు. అందుకే తరువాత సినిమాపై ఆయన కొత్తగా ఆలోచించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.  వెంకీ, చిరంజీవి లాంటి వాళ్లకు కథలు చెప్పారు. అలాగే తన సహాయకులకు అవకాశం ఇచ్చి చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నారు. 

వీటికి తోడు మళ్లీ మరో వైవిధ్యమైన భారీ సినిమాను తలకెత్తుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశ జనాలందరికీ చిరపరిచితమైన ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత గాథను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నిజంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే దర్ళకుడిగా ఆయన తపన తీర్చే రేంజ్ కథాంశం. పైగా నార్త్ టు సౌత్ జనాలకు పరిచయమైన గాథ. అందువల్ల భారత దేశ భాషలన్నింటిలోనూ తీసే అవకాశం వుంది. 

ఇలా చేయడం వల్ల బడ్జెట్ సమస్య కూడా వుండదు. పరిమిత బడ్జెట్ తోనే క్రిష్ శాతకర్ణిని వీలయినంత గొప్పగా తీసి చూపించారు. అలాంటిది ఆయనకు బాహుబలి లాంటి బడ్జెట్ దొరికితే? ఇంకా అద్భుతాలు ఆవిష్కరిస్తారు. అంటే ఇప్పుడు క్రిష్ కూడా రాజమౌళి బాట పట్టినట్లే అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?