Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి ఫ్యామిలీ ఎక్కడికి?

రాజమౌళి ఫ్యామిలీ ఎక్కడికి?

బాహుబలి ప్రాజెక్టులో అయిదేళ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన తరువాత కొన్నాళ్లు విశ్రాంతికి విదేశాలకు వెళ్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓ డిఫరెంట్ టేస్ట్ వున్నవాళ్లు. అలాంటి వాళ్లు నెల రోజుల పాటు గడపడానికి ఎంచుకునే డెస్టినేషన్ ఏదై వుంటుందా అన్నది కాస్త ఆసక్తి కరమే.

బాహుబలి 2 హడావుడి కాస్త సద్దు మణిగిన తరువాత రాజమౌళి ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిసి భూటాన్ వెళ్తున్నారట. భూటాన్ అంటే ఎలా వుంటుందో తెలిసిందే. అది కూడా బాహుబలి సినిమా చూసినట్లే వుంటుంది. మిగిలిన దేశాల మాదిరిగా కాకుండా, కొండలు, లోయలు, పచ్చదనం, పవిత్ర ఆరామాలు ఇలాంటి డిఫరెంట్ లొకేషన్ అది.

అయిదేళ్ల ఉరకలు పరుగుల తరువాత విశ్రాంతికి నాగరికత విపరీతంగా పెరిగిపోయిన దేశాల కన్నా, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అయితేనే బాగుంటుంది. బహుశా ఆ ఉద్దేశంతోనే కావచ్చు, రాజమౌళి ఈ ప్లేస్ ను ఎంచుకున్నారు.

మొత్తం ఆరునెలలు క్యాంప్

టోటల్ గా రాజమౌళి ఫ్యామిలీ విదేశాల్లో ఆరు నెలలు గడుపుతారు. ఇందులో భూటాన్ బౌద్ధ ఆరామాలతో పాటు, ఇండోనేషియాలోని కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలు వున్నాయి. చివరకగా ఒకటి రెండు నెలలు ఆస్ట్రేలియాలో గడుపుతారు. ఆ తరువాత తిరిగి వచ్చి కొత్త ప్రాజెక్టు ఏం చేయాలన్నది ఆలోచిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?