Advertisement


Home > Movies - Movie Gossip
రాజమౌళికి తండ్రి కానుక : ‘కొత్త తమ్ముడు’!

జాతీయ స్థాయి కథారచయిత విజయేంద్ర ప్రసాద్- అంతర్జాతీయ స్థాయి దర్శకుడు రాజమౌళి తండ్రీ కొడుకులు అనే సంగతి అందరికీ తెలుసు. అయితే తాజాగా తండ్రి విజయేంద్ర ప్రసాద్, రాజమౌళికి ఒక కొత్త తమ్ముడిని కానుకగా ఇచ్చుకున్నాడు. మరోలా భావించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.

‘అదిరింది’ చిత్ర దర్శకుడు అట్లీని విజయేంద్రప్రసాద్.. నువ్వు నా కొడుకు లా౦టోడివి.. రాజమౌళి నాకు ఒక కొడుకు అయితే.. నువ్వు మరొక కొడుకువి.. నీ కెరీర్  మొత్తం నీ వెన్నంటి ఉండి నడిపిస్తాను అని స్వయంగా చెప్పారట. ఈవిషయాన్ని స్వయంగా అట్లీనే వెల్లడించాడు.

అదిరింది సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో అట్లీ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో భాగంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి తాను రెండు మూడు ప్రాబబలిలిటీస్ అనుకున్నానని...  చాలా సందేహించిన తర్వాత.. వాటిని విజయేంద్ర ప్రసాద్ ముందు పెట్టినప్పుడు ఇది చాలా బాగుంది.. అమేజింగ్.. ఇలాగే చేద్దాం అంటూ ఆయన దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసి.. అద్భుతంగా కథను తీర్చిదిద్దారని అట్లీ చెబుతున్నాడు.

పైగా విజయేంద్రప్రసాద్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వాడని.. ఈ సినిమా విజయవంతం కావడంలో ఆయన పాత్ర చాలా ఉన్నదని అట్లీ కితాబులు ఇస్తున్నారు. మొత్తానికి అదిరింది టీమ్ మొత్తం మంచి జాయ్ ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.