Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది క్లియర్.. మెగా కాంపౌండ్ లోకి రాజమౌళి

ఇది క్లియర్.. మెగా కాంపౌండ్ లోకి రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళికి మెగా కాంపౌండ్ కు పడదనే విషయం ఓపెన్ సీక్రెట్. మగధీర టైమ్ లోనే కాంపౌండ్ కు రాజమౌళికి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాజమౌళి కూడా చెప్పేశాడు. “అవును.. మాకు పడదు” అని కుండబద్దలు కొట్టేశాడు. కానీ ఇప్పుడు అదే రాజమౌళి చిరంజీవి 151వ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేశాడు. అంతకంటే ముందు పలు సందర్భాల్లో మెగా హీరోల్ని కలుసుకున్నాడు.

బాహుబలి-2 చారిత్రక విజయం తర్వాత మెగా కాంపౌండ్ కావాలనే రాజమౌళికి దగ్గరైంది. సినిమా సక్సెస్ అయినప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి హీరోలు ప్రత్యేకంగా రాజమౌళిని మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో చిరంజీవి, రాజమౌళిని వ్యక్తిగతంగా కలుసుకున్నారు కూడా. ఇక అల్లు అరవింద్ అయితే ఎప్పటికప్పుడు రాజమౌళితో టచ్ లోనే ఉన్నారు.

ఈ నేఫథ్యంలో అల్లు అర్జున్, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు మగధీర కాంబినేషన్ కూడా రిపీట్ అవ్వొచ్చంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. రామ్ చరణ్ తో సినిమా కోసమే చిరంజీవి ఆ మధ్య ప్రత్యేకంగా రాజమౌళితో మాట్లాడారని చాలామంది చెప్పుకున్నారు.

ఇండస్ట్రీలో రాజమౌళి వివాదరహితుడు. మెగాహీరోలతో కూడా ఆయన సినిమా చేయొచ్చు. కానీ వెంటనే ఆ ప్రాజెక్టు ఉండదనేది చాలామంది చెబుతున్న మాట. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి వద్ద కథ సిద్ధంగా లేదు. అటు చరణ్, బన్నీ కూడా ఇప్పటికే కొన్ని కమిట్ మెంట్స్ ఇచ్చి ఉన్నారు. సో.. బన్నీ లేదా చరణ్ తో సినిమా పట్టాలపైకొచ్చే కంటే ముందు రాజమౌళి మరో సినిమా చేస్తాడు. ఆ సినిమా ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?