Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి-మహేష్ సినిమా: ఓ అందమైన కల

రాజమౌళి-మహేష్ సినిమా: ఓ అందమైన కల

ఇవి మచ్చుకు కొన్ని స్టేట్ మెంట్స్ మాత్రమే. గడిచిన పదేళ్లలో ఈ స్టార్ హీరో, ఈ స్టార్ దర్శకుడు కలిసి ఇలాంటివి చాలా ప్రకటనలు గుప్పించారు. కానీ ఈ దశాబ్దకాలంలో కలిసి సినిమా చేయడానికి వీళ్లకు అస్సలు వీలుపడలేదట. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారట. 

బాహుబలి-2 భారీ విజయం సాధించిన వేళ.. ఈ కాంబినేషన్ మరోసారి తెరపైకొచ్చింది. రాజమౌళి కూడా ఈ విషయంపై చాలాసార్లు స్పందించాడు. తాజాగా మహేష్ కూడా మరోసారి రియాక్ట్ అయ్యాడు. 

"కలిసి సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. కానీ ఎప్పుడనేది అప్పుడే చెప్పలేం. తన కమిట్ మెంట్స్ పూర్తవ్వాలి. నేను ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలి. రాజమౌళితో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను." మహేష్ నుంచి మళ్లీ అదే రొటీన్ స్టేట్ మెంట్. 

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తే చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటాడు. ప్రేక్షకుడు అనుకున్నంత గట్టిగా వీళ్లిద్దర్లో ఏ ఒక్కరు అనుకున్నా ఈ పదేళ్లలో సినిమా వచ్చి ఉండేది. కానీ వీళ్లు అనుకోరు. ఎవరి సినిమాలు వాళ్లవి. ఎవరి లెక్కలు వాళ్లవి. వీళ్లు ఇలా లెక్కలేసుకున్నంత కాలం రాజమౌళి-మహేష్ కాంబినేషన్ ఓ కలగానే మిగిలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?