Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళిని, ప్రభాస్ ను చూడండి

రాజమౌళిని, ప్రభాస్ ను చూడండి

బాహుబలి సిరీస్ తో ప్రపంచ ఖ్యాతి సంపాదించాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 2 ప్రపంచ రికార్డు సాధించింది. కానీ ఎక్కడా రాజమౌళి నోట కానీ, హీరో ప్రభాస్ నోట కానీ చిన్న మాట వినిపించలేదు. మేం సాధించాం, కొట్టేసాం, మేం తురుము, తోపు అని.

బాహుబలి వన్ కు క్రిటిక్స్ మంచి సమీక్షలు ఇవ్వలేదు. కానీ కలెక్షన్లు కుమ్మేసాయి. అయినా పెదవి విప్పి మాట్లాడిన పాపాన పోలేదు. మౌనంగా రెండో భాగం తీసి చూపించారు. కోట్లకు కోట్లు కొల్ల గొట్టారు. అయినా మాటల్లేవు.. మాట్లాడ్డాల్లేవు.

మరి ఈ హరీష్ శంకర్ ఏమిటి? ప్రపంచాన్ని జయించేసినట్లు మాట్లాడుతున్నారు. రామయ్యా వస్తావయ్యా తరువాత ఒక్క పెద్ద హీరో పిలిచి సినిమా ఇచ్చిన పాపాన పోలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తరువాత కూడా అదే పరిస్థితి.

ఆఖరికి అదృష్టం బాగుంది. దిల్ రాజు బన్నీ సినిమాను సెట్ చేసారు. వాళ్ల ప్రయత్నం వాళ్లు చేసారు. నాలుగు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. ఎంతో కొంత కలెక్షన్లు వచ్చాయి.

దాంతో తనేంటో ప్రూవ్ చేసుకున్నట్లు, క్రిటిక్స్ కు అతీతం అయిపోయినట్లు మాట్లాడతారేమిటి? తన ఏటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చిందని ఓ స్టేట్ మెంట్ కూడా. 

గబ్బర్ సింగ్ మేకింగ్ లో హరీష్ శంకర్ పాత్ర ఎంతో నిర్మాత బండ్ల గణేష్ కు తెలుసు, హీరో పవన్ కళ్యాణ్ కు తెలుసు. అంతెందుకు డిజె సినిమా డైలాగుల వెనుక ముగ్గురు అసిస్టెంట్ రైటర్లు వున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు నిజం కాదా?

ఎదిగిన కొద్దీ ఒదిగి వుండాలన్నది అరిగిపోయిన మాట. కానీ హరీష్ మాత్రం మొత్తం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా తీసినట్లు ఫీలవుతున్నారు.

డిక్టేటర్ లాంటి మీడియం హిట్ కొట్టిన తరువాత శ్రీవాస్ కు, అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి జూనియర్ హీరో తొ సినిమా దొరకడానికి ఎన్నేళ్లు పట్టింది? ఇప్పుడు హరీష్ శంకర్ కు వెంటనే సినిమా రెడీగా వుందా? వెయిట్ అండ్ సీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?