Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి ఒప్పుకున్నారుగా

రాజమౌళి ఒప్పుకున్నారుగా

సైజ్ జీరో పేరిట బల్కీ బ్యూటీగా తయారైన అనుష్కను మళ్లీ స్లిమ్ లుక్ లోకి తీసుకురావడానికి గ్రాఫిక్స్ కోసం బోలెడు ఖర్చు చేస్తున్నారని గతంలోనే వెల్లడించాం. అనుష్క నాచురల్ గా సైజ్ తగ్గలేకపోవడంతో, ఇక గత్యంతరం లేక రాజమౌళి ఈ బాట పట్టినట్లు అప్పట్లోనే వార్తలు అందించాం.

ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే ధృవీకరించారట. పార్ట్ వన్ తో పాటు చిత్రీకరించిన పార్ట్ 2 సీన్ల వరకు ఒకె. మిగిలిన వాటిలో అనుష్క లుక్ ను డిజిటల్ టెక్నాలజీతో కాస్త సరిచేసినట్ల రాజమౌళి వెల్లడించేసారు. అయితే ఇది కొత్తేం కాదని, చాలా సినిమాలకు ఇలా చేస్తుంటాలరని కూడా కవర్ చేసారు.

ఏమయితేనేం..టెక్నాలజీ బాగా పెరిగింది. హీరోలు, హీరోయిన్లకు క్రేజ్ వుంటే చాలు, ఫిజిక్ ఎలా వున్నా కంప్యూటర్లో చెక్కేయవచ్చు. ఆ మధ్య వచ్చిన ఖైదీ నెం 150 కి కూడా పాటల్లో ఈ టెక్నాలజీ కాస్త వాడారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?