Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజశేఖర్ లో ఆ జోష్ ఏదీ?

హీరో రాజశేఖర్ ఇండస్ట్రీలోకి వచ్చి ముఫై మూడేళ్లవుతోంది. కానీ కెరీర్ ప్లానింగ్ లో వెనుకపడడంతో, ఇప్పుడు కెరీర్ కంటిన్యూటీ లేకుండా పోయింది. దాంతో ఫామ్ లో లేకపోవడమే కాదు, నటనలో జోష్ కూడా పోయినట్లు కనిపిస్తోంది.  గడచిన పదేళ్లలో ఏడాదికో, రెండెళ్లకో ఓ సినిమా వంతున వచ్చాయి కానీ, ఏవీ ప్రేక్షకుల దగ్గరకు సరిగ్గా చేరలేదు. కర్ణుడి చావుడికి వున్నన్ని కారణాలూ, రాజశేఖర్ కెరీర్ పాడైపోవడానికి వున్నాయి. 

అయితే ప్రస్తుతం రాజశేఖర్ గరుడవేగ అనే ఓ సినిమా చేస్తున్నాడు. చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు. టెక్నాలజీతో కూడా డిఫరెంట్ సినిమాను చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలో రాజశేఖర్ నే హీరో. ఈ సినిమా టీజర్ ను వదిలారు. టీజర్ చూస్తే, ఒకప్పటి రాజశేఖరేనా? అని అనుమానం కలుగుతుంది. రాజశేఖర్ సమకాలీకులైన అనేక మంది హీరోలు, అయితే హీరోలుగానో, క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో, విలన్ లు గానో కంటిన్యూ అవుతున్నరు. నటనలో తమ స్టయిల్ కోల్పోలేదు. 

కానీ గరుడవేగ టీజర్ లో రాజశేఖర్ ను చూస్తుంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్, టఫ్ పోలీస్ క్యారెక్టర్లు అద్భుతంగా పోషించిన, ఆ రాజశేఖరేనా? అని అనుమానం కలుగుతుంది. టీజర్ మొత్తం మీద అరడజను సార్లు రాజశేఖర్ కనిపించాడు కానీ ఒక్కసారే యాక్షన్ మోడ్ లో కనిపించాడు. ఆ సీన్ సంగతి అలా వుంచితే మిగిలిన సీన్లలో నిల్చున్నా, చూస్తున్నా, మరెలా వున్నా కూడా రాజశేఖర్ లో ఆక్టివ్ నెస్ కొద్దిగా కూడా కనిపించలేదు. డల్ గా అలా వున్నాడంతే. 

రాజశేఖర్ వయసు కూడా మరీ ఎక్కువేమీ కాదు. యాభై అయిదేళ్లు. అంతమాత్రమానికే అలా డల్ ఫోజ్ లు ఇవ్వడం ఏమిటో? ఇప్పుడున్న సీనియర్ హీరోల వయసు రాజశేఖర్ కన్నా ఎక్కువే. కానీ వాళ్లు ఆక్టివ్ గా వుంటున్నారు. బహుశా కెమేరా ముందుకు రావడం అన్నది రెగ్యులర్ కాకపోవడంతో అలా అయిపోయాడేమో? అని అనుకోవాల్సి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?