Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి ఆర్టిస్టా? ఆర్కిటెక్టా?

రాజమౌళి ఆర్టిస్టా? ఆర్కిటెక్టా?

అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగు మాదిరిగా..కాస్సేపు ఫ్రాంక్ గా మాట్లాడేసుకుందాం? గుర్రం చేసే పని గుర్రం చేయాలి..అంటే ఎవరు చేసే పని వారు చేయాలి. సినిమాకైనా అంతా, రాజధాని నిర్మాణానికైనా అంతే. అందుకే శ్రీశ్రీ అన్నాడు తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎందరో అని. బాహుబలి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ ది. ఆ కథలో ఊహలకు తొలుత ప్రాణం పోసింది, స్కెచ్ ఆర్టిస్టులు. వారు వేలాదిగా బొమ్మలు గీసి, ఆ కథకు ప్రాణ ప్రతిష్ఠ చేసారు. ఆ స్కెచ్ లు ఆధారంగా ఆర్ట్ డైరక్టర్ సెట్ లు వేసారు. ఆ స్కెచ్ ల ఆధారంగా గ్రాఫిక్ ఇంజనీర్లు అద్భుతాలు సృష్టించారు. 

అంతే కానీ, దర్శకుడు రాజమౌళి ఆర్టిస్టూ కాదు, ఆర్కిటెక్టూ కాదు. ఆయన దర్శకుడు. సీన్లు ఎలా వుండాలి..స్క్రీన్ ప్లే ఎలా వుండాలి..నటీనటుల హావభావాలు ఎలా పండాలి? అన్ని క్రాఫ్ట్ ల నుంచి మంచి అవుట్ పుట్ ఎలా తీసుకోవాలి అన్నది మాత్రమే ఆయన కానీ మరే దర్శకుడు అయినా కానీ చేసే పని. రుద్రమ దేవి సినిమా విషయం దర్శకుడు గుణశేఖర్ చేసింది అయినా అంతే. 

మరి అలాంటిది రాజమౌళిని పిలిచి అమరావతి భవనాల ఆకృతులు ఎలా వుండాలో సలహాలు కోరడం ఏమిటి? ఇలాంటి సలహాలు ఆర్కిటెక్ట్ లు ఇస్తారు. ఇంకా ఊహకు అందరి ఇమేజినేషన్ లు కావాలంటే మంచి ఆర్టిస్టులను పిలిచి అడిగితే, వారు అద్భుతమైన చిత్రాలు గీసి ఇస్తారు. అప్పుడు వాటిని ఆర్కిటెక్ట్ లకు ఇస్తే, ఎలా నిర్మించాలో ప్లాన్ చేస్తారు. ఎక్కడైనా జరిగేది ఇదే తప్ప, సినిమా దర్శకులను పిలిచి అడగడం కాదు. 

ఆ లెక్కన హాలీవుడ్ లో చాలా మంది దర్శకులు వున్నారు. ఇంకా మాట్లాడితే విడియో గేమ్ లు డిజైన్ చేసే వారు వున్నారు. వీళ్లను కూడా అమరావతి భవనాల డిజైనింగ్ కు కబురుచేస్తే సరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?