Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత ఆఫర్ రకుల్ చేతికి

సమంత ఆఫర్ రకుల్ చేతికి

ఓ పెద్ద ఆఫర్ ను సమంత కావాలనే వదిలేసుకుంది. ఇప్పుడా అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ ను వరించింది. కోలీవుడ్ బడా స్టార్ విజయ్ తో దర్శకుడు మురుగదాస్ మరో సినిమా ప్లాన్ చేశాడు. స్పైడర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభమయ్యేది ఇదే. ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్స్, పెళ్లి కారణంగా ఆ ఆఫర్ ను వదులుకుంది సమంత. ఇప్పుడా ఛాన్స్ రకుల్ ను వరించింది.

గతంలో మురుగదాస్-విజయ్-సమంత కలిసి పనిచేశారు. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా తమిళనాట ఘనవిజయం సాధించింది. ఇదే సినిమా తెలుగులో ఖైదీ నంబర్ 150గా రీమేక్ కూడా అయింది. అలా విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన మురుగదాస్.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేశాడు. ఆ మూవీలో మరోసారి సమంతను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడా అవకాశం రకుల్ కు దక్కింది.

ప్రస్తుతం మురుగదాస్ తో స్పైడర్ సినిమాలో నటిస్తోంది రకుల్. దీంతో పాటు తమిళ్ లో కార్తి సరసన కూడా నటిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తన బేస్ పెంచుకుంటోంది. ఇలాంటి టైమ్ లో విజయ్ సరసన సినిమా అంటే కచ్చితంగా రకుల్ కు ఇది బంపర్ ఆఫరే. స్పైడర్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?