Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్‌కి ఇంకో స్పీడ్‌ బ్రేకరా?

రకుల్‌కి ఇంకో స్పీడ్‌ బ్రేకరా?

వరుసగా రెండు హిట్‌ సినిమాల్లో నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని అంతా గోల్డెన్‌ లెగ్‌ అనేసారు. ఆమె ఉంటే సినిమా హిట్టే అంటూ మీడియా రకుల్‌ని కొత్త సమంతని చేసేసింది. కానీ ‘కరెంట్‌ తీగ’ తెగడంతో రకుల్‌కి వచ్చిన అదృష్ట లక్ష్మి ఇమేజ్‌కి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన ‘రఫ్‌’ ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. 

రకుల్‌కి పాపులారిటీ రాకముందే ఈ చిత్రం సైన్‌ చేసింది. ఆమె చెప్తున్న దానిని బట్టి తెలుగులో తన సైన్‌ చేసిన ఫస్ట్‌ మూవీ ఇదే. సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగా నటించిన ఈ చిత్రం నిర్మాణంలో చాలా కష్టాలు పడి చివరకు రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం హిట్‌ అవ్వాలని రకుల్‌ తెగ ఇదైపోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా కూడా మిస్‌ఫైర్‌ అయిందంటే.. వరుసగా రెండు హిట్లు ఇచ్చిన ఊపుని వరుసగా రెండు ఫ్లాపులు తగ్గించేస్తాయని భయం పిల్లకి. 

ఫైనల్‌ ప్రోడక్ట్‌ చూసానని, లేట్‌ అయినా కానీ లేటెస్ట్‌గా ఉంటుందని... రఫ్‌ తప్పకుండా రఫ్‌ ఆడిస్తుందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్తోంది. ఏమాత్రం రఫ్పాడిస్తుందనేది శుక్రవారం తేలిపోతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?