Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్ మదిలో ఏముంది?

రకుల్ మదిలో ఏముంది?

సినిమా రంగంలోని వ్యక్తిని చేసుకుంటానా లేదా? అన్నది పక్కన పెడితే తెలుగింటి కోడలిని కావాలని అనుకుంటున్నా. ఏం అలా తెలుగింటి కోడలిని అయితే ఏమన్నా తప్పా? అని ప్రశ్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. కరెంట్ ట్రెండింగ్ హీరోయిన్లలో టాప్ లో వుంది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు యంగ్ బ్యాచ్ హీరోల పక్కన నటించేసింది. ఇప్పడు కోలీవుడ్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్ ను కాస్త పక్కన పెట్టింది. 

అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వూలో అన్న ఈ మాటలు కాస్త సంచలనంగా మారుతున్నాయి. తెలుగింటి కోడలు కావాలని వుంది అనడం వేరు. అలా అయితే తప్పా అని ఎదురు ప్రశ్నించడం వేరు. ఈ రెండూ కలుపుకుంటే ఈ విషయంపై రకుల్ కాస్త బలంగానే ఆలోచిస్తోంది అని అనుకోవాల్సి వస్తుంది. తెలుగింటి కోడలు అంటే సినిమా రంగంలో వున్న అమ్మాయి సహజంగా సినిమా రంగం వాళ్లనే చేసుకునే ఛాన్స్ లు ఎక్కువ వుంటాయి. 

మరి రకుల్ ఇలా అంటోంది అంటే సినిమా రంగంలో ఎవరిపైనన్నా లేదా ఎవరితోనన్నా టచ్ లో వుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి రకుల్ పై ఆమె కెరీర్ ప్రారంభంలోనే చాలా గ్యాసిప్ లు వచ్చాయి. అప్పట్లో ఆమె సినిమా ఎంట్రీకి బాగా సహకరించిన ఓ యంగ్ హీరోతో సన్నిహితంగా వుంటుందని గ్యాసిప్ లు వినిపించాయి. తరువాత మళ్లీ అవన్నీ కట్ అయిపోయాయి అని కూడా వచ్చాయి. తరువాత, తరువాత రకుల్ పూర్తిగా కెరీర్ మీద తన స్వంత వ్యాపారాల మీద దృష్టి పెట్టింది. చకచకా టాప్ పొజిషన్ కు దూసుకుపోయింది.

మరి ఇప్పుడు టాలీవుడ్ లో కెరీర్ కు కాస్త పాజ్ బటన్ నొక్కిన సమయంలో ఇలా మాట్లాడుతోంది అంటే, సమ్ థింగ్.. సమ్ థింగ్ అనుకోవాలా? టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మందే వున్నారు. మరి ఎవరో రకుల్ కట్టుకోబోయే అదృష్టవంతుడు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?