Advertisement


Home > Movies - Movie Gossip
మహేష్ సరసన మరోసారి రకుల్?

మహేష్ సరసన నటించాలని ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ ఇప్పుడు అతడితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేందుకు రెడీ అవుతోంది. అవును.. తాజా సమాచారం ప్రకారం తన నెక్ట్స్ మూవీలో కూడా రకుల్ కే అవకాశమివ్వాలని భావిస్తున్నాడట మహేష్. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి స్పైడర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సెట్స్ పైకి రానున్న "భరత్ అను నేను" సినిమాలో కూడా మహేష్ సరసన రకుల్ నటించే అవకాశాలున్నాయి. 

కొరటాల దర్శకత్వంలో రాబోతున్న "భరత్ అను నేను" సినిమా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో ప్లాన్ చేశారు. 10 రోజుల పాటు లండన్ లో షూట్ చేసిన తర్వాత మిగతా భాగాన్ని హైదరాబాద్ లో కంప్లీట్ చేస్తారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తిచేసిన కొరటాల.. ప్రస్తుతం  నటీనటుల ఎంపికలో ఉన్నాడు. 

నిజానికి మహేష్-కొరటాల సినిమా కోసం మరోసారి శృతిహాసన్ పేరును పరిశీలించారు. గతంలో మహేష్-శృతిహాసన్-కొరటాల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ రీసెంట్ గా శృతిహాసన్ చేసిన కాటమరాయుడు సినిమాలో ఆమె లుక్స్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పునరాలోచనలో పడిన యూనిట్.. శృతి స్థానంలో రకుల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.