Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్.. భర్తను తిరిగి దగ్గరికి రప్పించుకోగలదా?

హీరోయిన్.. భర్తను తిరిగి దగ్గరికి రప్పించుకోగలదా?

తన భర్త తనను విడిచి ఉంటున్నాడని, అతడిని తనతో కలిసి ఉండేలా ఆదేశించాలని కోరుతూ మొన్నటి స్టార్ హీరోయిన్ రంభ చెన్నై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి విచారణ జరిగింది. అయితే శనివారం ఆమె కానీ, ఆమె భర్త కానీ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ విచారణ వాయిదా పడింది. వచ్చే నెల నాలుగో తేదీన ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరగనుంది.

ఆరేడేళ్ల కిందట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది రంభ. ఆ వెంటనే కూతురు కూడా పుట్టింది. కూతురుకు కొన్న బంగారు ఊయలతో కూడా ఈమె వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. భర్త, ఈమె ఒకరికొరు దూరం అయినట్టుగా తెలుస్తోంది. 

ఇప్పుడు భర్తను తిరిగి దక్కించుకోవాలని రంభ ప్రయత్నిస్తోంది. తన భర్త తనతో కలిసి ఉండేలా ఆదేశించాలని కోరుతూ ఈమె ఫ్యామిలీ కోర్టుకు ఎక్కింది. విశేషం ఏమిటంటే.. రంభ భర్త ఆమెతో కాపురానికి ఆసక్తితో లేకపోవడం. ఈ బంధాన్ని తప్పించుకోవడానికి ఆయన లాయర్ ను కూడా నియమించుకున్నాడు! కలిసి కాపురం చేయాలనేది రంభ వాదన, కుదరదనేది ఆమె భర్త వాదనగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రంభ భర్త నుంచి భత్యాన్ని కూడా డిమాండ్ చేస్తోంది. తనకు నెలకు లక్షన్నర, తన కూతురి ఖర్చులకు నెలకో యాభై వేల రూపాయలు భర్త చెల్లించాలని.. కలిసి కాపురం చేసేంత వరకూ ఈ విధంగా చెల్లించాలని  ఈమె కోరుతోంది. మరి చాలామంది హీరోయిన్ల వైవాహిక జీవితాలు విఫలం కావడం ఇది వరకూ వార్తల్లోని అంశాలుగా నిలిచాయి. అయితే రంభ మాత్రం వారందరికీ భిన్నంగా.. తన భర్తను తన దగ్గరికి చేర్చుకోవడానికి న్యాయపోరాటం చేస్తోంది. మరేం జరుగుతుందో! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?