Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్‌గోపాల్‌ వర్మకి తొందరెక్కువా.?

రామ్‌గోపాల్‌ వర్మకి తొందరెక్కువా.?

'రక్తచరిత్ర'ని రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ, ఆ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు.? ప్చ్‌, ఎవరికీ తెలియదు. పరిటాల రవీంద్ర, మద్దెలచెరువు సూరి తదితర ముఖ్య పాత్రలు సినిమాలో వున్నాయంతే. కానీ, వాస్తవానికీ, సినిమాకీ పొంతనే లేదు. వర్మ తనకు నచ్చింది తీశాడంటే. ఇక్కడ వర్మ లాజిక్‌ వేరేలా వుంది, 'తెలుసుకున్నాను, నాకు నచ్చింది తీశాను..' అన్నదే వర్మ లాజిక్‌. ఇంతలా లాజిక్‌ లాగాక వర్మని విమర్శించడానికేముంది.? 

అనంతపురం జిల్లా ఫాక్ష్యన్‌, హత్యా రాజకీయాలకు సంబంధించి 'వాస్తవాలు', 'రక్తచరిత్ర' ద్వారా వెలుగులోకి వస్తాయని ఊహించడం ప్రేక్షకుల మిస్టేక్‌. అంతే.! ఇక, ఇప్పుడు 'నయీం' సినిమా తెరకెక్కిస్తున్న వర్మ, ఈ సినిమాలోనూ తనకు నచ్చిందే చూపించబోతున్నాడు. తన సినిమాకి మాంఛి మసాలా కోసం వర్మ, గ్యాంగ్‌స్టర్‌ నయీం సన్నిహితులను జైళ్ళలో కలిసి, సమాచారం సేకరించాడు. తాను తెలుసుకున్నదంతా సినిమాలో యధాతథంగా చూపించే అవకాశమే లేదు. 

సినిమా షూటింగ్‌ని చకచకా పూర్తి చేసేసి, జనవరిలో వర్మ సినిమాని రిలీజ్‌ చేసేస్తాడట. ఏమో, అసలు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. 'సంచలనం' అనిపించగానే, ఆ టాపిక్‌ని తీసుకుని, సినిమాని అనౌన్స్‌ చేసేయడం, ఆ తర్వాత విడుదలను 'దైవాధీనం' చేసేయడం వర్మకి అలవాటే. 'నయీం' విషయంలోనూ అదే జరగొచ్చుగాక.! 

లేదూ, వర్మ జనవరిలోనే 'నయీం' సినిమాని విడుదల చేసేయాలనే పట్టుదలతో వుంటే, ఈ పాటికే కథ సిద్ధం చేసేసుకుని వుండాలి. కానీ, నయీంకి సంబంధించి రోజుకో కొత్త డెవలప్‌మెంట్‌ తెరపైకి వస్తోంది. పోలీసు అధికారులు, పొలిటికల్‌ లీడర్స్‌ అరెస్టవుతారంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి లీకేజీలు మీడియాకి అందుతున్నాయి. ఈ లీకేజీలు నిజమైతే, అసలు కథకు భిన్నంగా వాస్తవాలు వుంటే, వర్మ 'నయీం' తేడా కొట్టేయడం ఖాయం. 

కానీ, వర్మ తక్కువోడేమీ కాదు. నయీం ఎన్‌కౌంటర్‌ వరకూ మాత్రమే సినిమాలో చూపించే అవకాశాలున్నాయి. ఎటూ, 'నాకు తెలిసింది తీశాను..' అని చెప్పుకోడానికి వర్మ ఏమాత్రం మొహమాటపడడు కదా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?