Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రమ్యకృష్ణ కొడుకుగా వరుణ్ సందేశ్

రమ్యకృష్ణ కొడుకుగా వరుణ్ సందేశ్

మంచు మోహన్ బాబు సినిమాలో మళ్లీ మరోసారి వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు. ఇంతకు ముందు పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించాడు. ఇప్పుడు కలెక్షన్ కింగ్, అల్లరి నరేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో చేస్తున్నాడు.

ఈ సినిమాలో మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మీనా, రమ్యకృష్ణ. వారిలో రమ్యకృష్ణ కొడుకుగా వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు. అల్లుడిగా నరేష్, కూతురుగా పూర్ణ చేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమాలో మోహన్ బాబు మీద ఓ పాట వుంచాలని డిసైడ్ అయ్యారు. అయితే అది మీనాతోనా, రమ్యకృష్ణతోనా, లేక ఇద్దరితోనా అన్నది ఇంకా తెలియాలి.

నరేష్ వున్నాడు కాబట్టి, మరీ రెండు పాటలు మోహన్ బాబు మీదేనా అని అంటారేమో అని అనుమానం. ఈ సినిమాకు ఓ మరాఠీ సినిమా ఆధారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?