Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పైసా వసూల్ బాటలో రంగస్థలం

పైసా వసూల్ బాటలో రంగస్థలం

ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న టైమ్ కు సినిమాను విడుదల చేస్తే అదే పదివేలు. అలాంటిది అనుకున్న టైమ్ కంటే 3 వారాల ముందే రిలీజ్ కు రెడీ అయింది పైసా వసూల్ మూవీ. బాలయ్య, పూరిజగన్నాథ్ పోటీపడి మరీ వర్క్ చేశారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇప్పుడీ సినిమాలానే రంగస్థలం కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే రెడీ అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి నవంబర్ చివరి వారం వరకు ఈ సినిమా షూటింగ్ పెట్టుకున్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలకు మరో నెల రోజులు కేటాయించి సంక్రాంతి బరిలో దిగాలనేది ఆలోచన. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది.

కుదిరితే డిసెంబర్ లోనే రంగస్థలం సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయట. అక్టోబర్ ఆఖరి వారం నాటికి రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు. ఇకపై మ్యాగ్జిమమ్ షూటింగ్ ఆ సెట్ లోనే కానిచ్చేస్తారని తెలుస్తోంది. అటు చరణ్, ఇటు సమంత ఇద్దరూ ఈ సినిమాకు కావాల్సినన్ని కాల్షీట్లు కేటాయించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?