Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రత్తాలు స్టిల్స్ ఎక్కడ?

రత్తాలు స్టిల్స్ ఎక్కడ?

ఖైదీ నెంబర్ 150 సినిమా అయిటమ్ సాంగ్ కోసం ఏరి కోరి తెచ్చుకున్నారు లక్ష్మీ రాయ్ ను. రత్తాలు..రత్తాలు అంటూ మాంచి సాంగ్ ను కూడా ట్యూన్ చేయించారు..లారెన్స్ మాంచి కొరియోగ్రఫీ కూడా అందించారు. సినిమా విడుదలైంది. పాట..పాటకు చిరు డ్యాన్స్ అన్నీ జనాలకు పట్టేసాయి. 

కానీ సినిమా అభిమాన జనం గమనించని విషయం ఏమిటంటే, పాట మేకింగ్, ఇంతరత్రా ట్రయిలర్ విడియోల్లో తప్పితే, లక్ష్మీ రాయ్ కనిపించకపోవడం. ఇప్పటి దాకా ఖైదీ సినిమా పబ్లిసిటీ స్టిల్స్ లో లక్ష్మీరాయ్ స్టిల్ ఒక్కటి కూడా కనిపించలేదు. 

కాజల్, చిరు కలిసి వున్న స్టిల్స్ తప్ప, లక్ష్మీ రాయ్ సోలోగా కానీ, చిరు పక్కన వున్నట్లు కానీ ఒక్క స్టిల్ కూడా కనిపించడం లేదు. మరి ఎందుకు వాడడం లేదో ఖైదీ యూనిట్ కే తెలియాలి. బహుశా మొదటి వారంలో హీరోయిన్ కాజల్, రెండో వారంలో అయిటమ్ అమ్మాయి స్టిల్స్ వాడాలనుకుంటున్నారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?