Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ పాయింట్ పట్టేసాడు

రవితేజ పాయింట్ పట్టేసాడు

అనిల్ రావిపూడి గురించి ఇండస్ట్రీలో ఒక మాట వినిపిస్తూంటుంది. సీన్లు బాగా అల్లుకుంటాడు. కథ దగ్గర వీక్ అవుతుంటాడు అని. రాజా ది గ్రేట్ దగ్గర ఇది బాగా కనిపించింది. వినిపించింది. ఈ సంగతి హీరో రవితేజ కూడా పసిగట్టినట్లున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 

'అనిల్ ఏ మాత్రం తగ్గోద్దు. ఇలాగే కొట్టుకుంటూ వెళ్లిపో, చెడగొట్టడానికి చాలా మంది ట్రయ్ చేస్తారు. నిన్ను తీసుకెళ్లి ఎక్కడో కూర్చో పెడతాం అంటారు. అవన్నీ విని అలాగే అనేసి నువ్వు అలాగే వెళ్లిపో' అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా అనిల్ అంతా బాగా చేసుకుంటాడు. కానీ ఒక్క దగ్గరే సమస్య. కథ గురించి కూడా బాగా చూసుకోవాలి. అది ఒక్కటి కాస్త చూసుకుంటే అనిల్ కు తిరుగులేదు అంటూ రవితేజ నిర్మొహమాటంగా ఓ సలహా కూడా ఇచ్చేసాడు. 

రవితేజ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం కూడా. అనిల్ రావిపూడి సీన్లు అద్భుతంగా ఎలివేట్ చేయగలడు. కామెడీ పండించగలడు. కథలో కూడా కాస్త కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తే టాప్ ఫైవ్ లో ఫిక్సయిపోతాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?