Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రీ ఎంట్రీకి జీవిత రెడీ

రీ ఎంట్రీకి జీవిత రెడీ

జీవిత హీరోయిన్ గా కొద్ది సినిమాలు చేసి, హీరో రాజశేఖర్ ను పెళ్లి చేసుకుని తెర మరుగైంది. ఆ తరువాత డైరక్షన్ వైపు వెళ్లి కొన్ని సినిమాలు చేసినా ఫలితం పెద్దగా లేకపోయింది. రాజకీయాలు ట్రయ్ చేసినా ఉపయోగం లేదు. ఆఖరికి భాజపా పుణ్యమా అని సెన్సారు పదవి దక్కింది. 

ఇప్పడు ఇక మరో సారి స్క్రీన్ పైకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని గ్యాసిప్ లే అందుకు కారణం కావడం విశేషం. రామ్ చరణ్, శ్రీను వైట్ల సినిమాలో తల్లి క్యారెక్టర్ కు జీవిత పేరు పరిశీలిస్తున్నారంటూ గ్యాసిప్ లు వచ్చాయి. నిజానికి వారు ఆమెను అడిగిందీ లేదు,,పరిశీలించిందీ లేదు. 

అయితే ఈ గ్యాసిప్ లు వచ్చిన తరరువాత జీవితకు మళ్లీ స్క్రీన్ పైకి రావాలని అనిపిస్తోందట. నదియా, రమ్యకృష్ణ తదితరుల మాదిరిగా మాంచి డిగ్నిఫైడ్ రోల్స్ వస్తే,చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చేయాలని అనుకుంటోందంట.  ఇక నిర్మాత, దర్శకులదే ఆలస్యం మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?