Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి-2 తర్వాత బాక్సాఫీస్ పరిస్థితేంటి..?

బాహుబలి-2 తర్వాత బాక్సాఫీస్ పరిస్థితేంటి..?

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది బాహుబలి-2 సినిమా. ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మరి ఇలాంటి టైమ్ లో నెక్ట్స్ వీకెండ్ వచ్చే సినిమాల పరిస్థితేంటి..? అసలు మే నెలలో వచ్చే సినిమాలు ఆడతాయా..? బాహుబలి-2 ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలవా..?

మే 5న బాబు బాగా బిజీ, రక్షకభటుడు, వెంకటాపురం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయనేది డౌట్. రక్షకభటుడు, వెంకటాపురం సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ మాత్రం "బాబు బాగా బిజీ"  సినిమాతో చెప్పిన డేట్ కు వస్తామంటున్నాడు. ఓ వైపు బాహుబలి-2 మేనియా కొనసాగుతున్నప్పటికీ మరోవైపు తమ సినిమా ప్రమోషన్ ను మాత్రం వీళ్లు ఆపలేదు.

ఇక మే 19పై చాలా సినిమాలు గురిపెట్టాయి. అప్పటికి బాహుబలి-2 విడుదలై 3 వారాలు గడిచిపోతుంది కాబట్టి థియేటర్లు కూడా దొరికే అవకాశం ఉంటుంది. నిఖిల్ నటించిన కేశవ, నాగచైతన్య నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం, గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్, నాగ్ అన్వేష్ నటిస్తున్న ఏంజెల్ సినిమాలు ప్రస్తుతం రేసులో ఉన్నాయి. వీటిలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చెప్పిన తేదీకి రాకపోవచ్చనే రూమర్ నడుస్తోంది.

ఈ సినిమాలతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న అంధగాడు, సునీల్ ఉంగరాల రాంబాబు సినిమాలు కూడా మే నెలలో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈ మొత్తం సినిమాల్లో ఎన్ని మే నెలలో రిలీజ్ అవుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?